Thursday 11 October 2012


టెక్ బజార్
Spectre-XT


హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్‌టీ

ఇది 13.3 అంగుళాల ఆల్ట్రా బుక్. ప్రీమియం మెటీరియల్స్‌తో రూపొందించిన దీని బరువు 1.4 కేజీలు. 14.5ఎంఎ మందం ఉంటుంది. యూఎస్‌బీ పోర్ట్స్, ఎంథెర్‌నెట్, హెచ్‌డీఎమ్‌ఐ, ఆడియో టాక్, ఎస్‌డీ కార్డ్ రీడర్‌ని కలిగి ఉంటుంది. థర్డ్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, ఇంటెల్ హెచ్‌డీ 4000 గ్రాఫిక్స్ ఇందులో ఉండే ఫీచర్లు. 128, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజీలను మీరు ఎంచుకోవచ్చు. విండోస్ 7 హోమ్ ప్రీమియం ఓఎస్‌తో పనిచేస్తుంది. దీని బ్యాటరీ ఎనిమిది గంటల పాటు పనిచేస్తుందని హెచ్‌పీ చెబుతోంది. దీని ధర 64,990 రూపాయలు. 
Samsung-Galaxy-Note-II

స్యామ్‌సంగ్ గెలాక్సీ నోట్2
స్యామ్‌సంగ్ గెలాక్సీ నోట్2లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. అంతకుముందు దానికంటే దీన్ని ఇన్నోవేటివ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. 9.7 ఎంఎం మందాన్ని 9.4 ఎంఎంకి తగ్గించారు. 5.3 అంగుళాల స్క్రీన్‌ని 5.5ఎంఎంకి పెంచారు. 1.6 జీహెచ్‌జెడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 64జీబీ మైక్రో ఎస్‌డీ కార్డ్ సపోర్ట్, 3,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఎస్-పెన్‌తో రాయడానికి చాలా స్టైలిష్‌గా ఉంది. దీని ధర 39,990 రూపాయలు. 
Idea-Aurus

ఐడియా ఆరుస్
ఐడియా ఆరుస్ అనేది ఒక డ్యుయల్ సిమ్ ఫోన్. డ్యుయల్ స్టాండ్‌బై(one SIM active at a time)ని కలిగి ఉంటుంది. రెండింట్లో ఒకటి మాత్రమే 3జీ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. 3.5 అంగుళాల డిస్‌ప్లే ఉండే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3 ఓఎస్‌తో పనిచేస్తుంది. 800 ఎంహెచ్‌జెడ్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్‌ని కలిగి ఉంటుంది. 32 జీబీ వరకు ఎక్స్‌టెర్నల్ స్టోరేజీ ఉంది. 136 గ్రాముల బరువుండే ఈ ఫోన్‌లో 5 ఎంపీ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్ ఉన్నాయి. ఈ డివైజ్‌లో ఐడియా తన సొంత యాప్ స్టోర్ అయిన ఐడియా యాప్ మాల్‌లోని కొన్నింటిని ప్రీలోడ్ చేసింది. ఆండ్రాయిడ్ మేనేజర్, ఫేస్‌బుక్, పిక్‌సే, రింగ్రాయిడ్, షాజమ్, ట్విట్టర్‌లాంటివి అందులో ఉన్నాయి. దీని ధర 7,190 రూపాయలు.
sony-xperia-tipo

సోనీ ఎక్స్‌పెరియా టిపో
ఇది సింగిల్ సిమ్, డ్యుయల్ సిమ్ వేరియంట్‌లలో దొరుకుతోంది. ఎక్స్‌పెరియా టిపో అనేది సోనీ రూపొందించిన కంపాక్ట్, లైట్ వెయిట్ ఫోన్. 3.2 అంగుళాల డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 4.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 800ఎంహెచ్‌జెడ్ ప్రాసెసర్ ఉంది. 512 ఎంబీ ర్యామ్, 2.9 జీబీ బిల్ట్ ఇన్ మెమరీ దీని సొంతం. 3.2 ఎంపీ రేర్ కెమెరా వీజీఏ రిజెల్యూషన్ వీడియోలను కూడా రికార్డ్ చేస్తుంది. Box.net నుంచి 50 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించుకోవచ్చు. వొడాఫోన్ యూజర్లు 500ఎంబీ సెల్యూలార్ డేటాని మొదటి మూడు నెలల వరకు ఉచితంగా పొందొచ్చు. దీని ధర 9,999 రూపాయలు. 
ultra_key_inline-1

లాగీటెక్ కీబోర్డ్ కేసెస్
లాగీటెక్ ఐప్యాడ్‌కి సంబంధించిన రెండు కీబోర్డు కేసులను విడుదల చేసింది. ఒకటి ఆల్ట్రాథిన్ కీబోర్డ్ కవర్, రెండోది సోలార్ కీబోర్డ్ ఫోలియో. ఈ కీబోర్డులను బ్లూటూత్ ద్వారా ఐప్యాడ్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్ట్రాథిన్ కీబోర్డ్ ఆరు నెలల బ్యాటరీ లైఫ్‌ని కలిగి ఉంటుంది. సోలార్ కీబోర్డ్ రెండు సంవత్సరాల వరకు ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేయగలదు. వీటి ధర 6,599 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. 

Samsung-Champ-Neo

ఫోసిల్ టైమ్ పీసెస్
చేతి వాచీల తయారీలో పాపులర్‌గా ఉన్న ఫోసిల్ కంపెనీ సరికొత్త టైమ్‌పీస్‌ల శ్రేణిని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఎఫ్‌ఎస్4734, ఎఫ్‌ఎస్4735, ఎఫ్‌ఎస్476 మోడల్ పేర్లతో లభిస్తున్న వీటి ధర 6,945 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. లైఫ్‌స్టైల్, షాపర్స్‌స్టాప్‌లాంటి స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి.

No comments:

Post a Comment