Monday 15 October 2012

అకాయ్ స్మార్ట్ బాక్స్

టీవీల్లోనే అంతర్జాలాన్ని శోధించడానికి ఉపయోగపడే 'స్మార్ట్ బాక్స్'ను అకాయ్ ప్రవేశపెట్టింది. ధర రూ.6,590. ఆండ్రాయిడ్ ఆధారితంగా ఇది పనిచేస్తుంది. 1.25 జీహెచ్‌జడ్ ప్రాసెసర్‌ను, 4జీబీ అంతర్గత మెమొరీని జత చేశారు. దీనిని 32 జీబీ వరకు విస్తరించుకోవచ్చు. నేవిగేషన్ కోసం ఒక వైర్‌లెస్ మౌస్ ఇస్తారు. ఇది వైఫై, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను ఉపయోగించి వీడియోలు, గేములు, వెబ్‌సైట్‌ల వంటి కంటెంటును వినియోగదారులు యాక్సెస్ చేసుకొనేందుకు తోడ్పడుతుంది. స్మార్ట్ బాక్స్‌కు 4 యూఎస్‌బీ పోర్టులు, హార్డ్ డ్రైవ్‌లు ఉంటాయి. ఈ పరికరం ల్యాన్, వైఫైలతో పాటు 3జీని ఉపయోగించుకొంటూ అంతర్జాలానికి అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది.

పెంటా టీ ప్యాడ్ టాబ్లెట్లు
డాంగిల్ ఆధారితం రూ.7,499
సిమ్ అమర్చుకునేది రూ.14,699
బీఎస్ఎన్ఎల్ డేటా ఆఫర్లతో లభ్యం

రాష్ట్ర విపణిలోకి బీఎస్ఎన్ఎల్ డేటా  ఆఫర్లతో   రెండు   టాబ్లెట్ పీసీలను  పాంటెల్ టెక్నాలజీస్ (పీపీటీఎల్) విడుదల చేసింది. 7 అంగుళాల కెపాసిటివ్ తాకే తెర, 1 జీబీ ప్రాసెసర్, 8జీబీ అంతర్గత మెమొరీ, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ డాంగిల్    అమర్చుకునే     సదుపాయం, ఆండ్రాయిడ్ 4.0.3 (ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్)  ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఐఎస్703సీ   టాబ్లెట్ ధ ర రూ.7,499 కాగా, రూ.1,500 విలువైన బీఎస్ఎన్ఎల్ 3జీ డాంగిల్ ఉచితంగా ఇస్తారు.

కొత్తగా కీబోర్డ్‌లు
ట్యాబ్లెట్ యూజర్లకు అదనపు క్వర్టీ కీబోర్డు అవసరం ఎక్కువే. అలాంటి వారికి లాగీటెక్ కంపెనీ కొత్తగా కీబోర్డ్ కేస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఐప్యాడ్‌కి ఇవి ప్రత్యేకం. చిత్రంలో చూపిన మాదిరిగా కీబోర్డ్‌ని పల్చటి కవర్, సోలార్ సెల్స్‌తో రూపొందించారు. బ్లూటూత్ కనెక్షన్‌తో ట్యాబ్‌ని కీబోర్డ్‌కి కనెక్ట్ చేయాలి. టైపింగ్‌కి అనువుగా ట్యాబ్‌ని కావాల్సిన యాంగిల్‌లో పెట్టుకోవచ్చు. కేస్‌లో ఏర్పాటు చేసిన సోలార్ సెల్స్ ద్వారా బ్లూటూత్ కీబోర్డ్ ఎప్పటికప్పుడు ఛార్జ్ అవుతుంది. వీడియో, ఇతర వివరాలకు http://goo.gl/QbluV, http://goo.gl/Uipk6

హెచ్‌సీఎల్ కొత్త ట్యాబ్లెట్ వెర్షన్‌

హెచ్‌సీఎల్ మరో కొత్త ట్యాబ్లెట్ వెర్షన్‌ ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. పేరు HCL ME Y2. ఇన్‌బిల్డ్‌గా ఏర్పాటు చేసిన 3జీ సౌకర్యంతో వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. అందుకు ప్రత్యేక సిమ్‌కార్డ్ స్లాట్ ఉంది. దీని తాకే తెర పరిమాణం అంగుళాలు. రిజల్యుషన్ 1024x600 పిక్సల్స్. ఆండ్రాయిడ్ 4.0, 1 జీబీ ర్యామ్, మాలి 400 జీపీయూ, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, వెనక భాగంలో 2 మెగాపిక్సల్ కెమెరా, ముందు వీజీఏ కెమెరా, హెచ్‌డీఎంఐ, మినీ యూఎస్‌బీ పోర్ట్ సౌకర్యాలతో పని చేస్తుంది. హెచ్‌సీఎల్ అందిస్తున్న ME App Store నుంచి అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. దీని బరువు 368 గ్రాములు. ధర సుమారు రూ.14,999. http://goo.gl/wHL3f

No comments:

Post a Comment