Thursday 18 October 2012

మరో రెండు ట్యాబ్‌లు! 


                         బడ్జెట్ ట్యాబ్లెట్‌ల జోరు పెరుగుతోంది. WickedLeak కంపెనీ రెండు ట్యాబ్‌లు అందుకు ఉదాహరణ. వీటి పేర్లు Wammy Desire & Athena. రెండూ ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్‌తో పని చేస్తాయి. 1.5 Ghz డ్యుయల్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, mali 400 గ్రాఫిక్స్‌ని వాడారు. డిజైర్ తాకేతెర పరిమాణం 7 అంగుళాలు. రిజల్యూషన్ 800x480. ఇంటర్నల్ స్టోరేజ్ 8 జీబీ. ముందుభాగంలో వీజీఏ కెమెరాని ఏర్పాటు చేశారు. ధర సుమారు రూ.6,500. ఇక Athena ట్యాబ్ తెర సైజు 9.7 అంగుళాలు. రిజల్యూషన్ 1024x768 పిక్సల్స్. ఇంటర్నల్ స్టోరేజ్ 16జీబీ. 2 మెగాపిక్సల్ పరిమాణం ఉన్న డ్యుయల్ కెమెరాల్ని వాడారు. ధర సుమారు రూ.13,999. రెండిటిలోనూ వై-ఫై, హెచ్‌డీఎంఐ అవుట్‌పుట్ సదుపాయాలు ఉన్నాయి. 

No comments:

Post a Comment