Thursday 8 November 2012


హెచ్‌టీసీ విండోస్ ఫోన్ 8ఎక్స్   
                    

       మనదేశంలో విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించిన ఫోన్లలో హెచ్‌టీసీ ముందుందని చెప్పొచ్చు. దివాళీ సంద ర్భంగా హెచ్‌టీసీ ఈ ఫోన్లను విడుదల చేసింది. 4.3 అంగుళాల డిస్‌ప్లే, హై రెజల్యూషన్, 1.5 జీహెచ్ జెడ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 ఎంపీ కెమెరా, 2.1 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఇందులో ఉన్న ఫీచర్లు. ఆడియో యాంపిఫైయర్ల వల్ల మంచి సౌండ్ క్వాలిటీ ఉంటుంది. స్కై డ్రైవ్‌లో 7 జీబీ వరకు స్టోరేజ్ ఉచితంగా ఇన్‌బిల్ట్ చేసి ఉంటుంది. దీని ధర 35, 023 రూపాయలు. 


మైక్రోమ్యాక్స్ ఏ110 సూపర్‌ఫోన్

           మైక్రోమ్యాక్స్ గతంలో విడుదల చేసిన ఏ 100 మాదిరిగానే ఈ ఫోన్ ఉంటుంది. కాకపోతే హార్డ్‌వేర్‌ని బాగా అప్‌డేట్ చేశారు. దీన్ని సూపర్ ఫోన్ కాన్వాస్2గా, ఫ్యాబ్‌పూట్ (ఫోన్ + టాబ్లెట్ పీసీ)గా పిలుస్తున్నారు. 5 అంగుళాల స్క్రీన్, 854 x 480 స్క్రీన్ రెజల్యూషన్, 1 జీహెచ్‌జెడ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 8 ఎంపీ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్; 9.7 ఎంఎం మందం, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ అప్‌క్షిగేడ్ చేసింది. మిగిలినవి 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి 32 జీబీ వరకు ఎక్స్‌పెండబుల్‌గా, డ్యుయల్ సిమ్ స్లాట్‌లను, 3జీ, వై-ఫైలను, బ్లూటూత్ 3.0ని, వీజీఏ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.0లను అలాగే ఉంచింది. మైక్రోమ్యాక్స్ సొంత యాప్ స్టోర్ నుంచి ఇందులో కొన్ని యాప్స్ ప్రీలోడ్ చేసి ఉన్నాయి. దీని ధర 9,990 రూపాయలు. 

లినోవా ఐడియా ఫోన్ కె 860

     ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల తయారీలో పెద్ద కంపెనీగా పేరొందిన లినోవా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఐడియా ఫోన్ కె860తో ఇది మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. దీన్ని కూడా పాబ్లెట్ ఫోన్‌గా చెప్పుకోవచ్చు. 9.5 ఎంఎం మందం, 190 గ్రాముల బరువుండే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 5 అంగుళాల స్క్రీన్, 1280 x 720 స్క్రీన్ రెజల్యూషన్, 1.4 జీహెచ్‌జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, క్వాడ్ కోర్ మలీ 400 గ్రాఫిక్స్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఎక్స్‌పెండబుల్, 8 ఎంపీ ఆటో ఫోకస్ కెమెరా(ఇది బర్ట్స్ మోడ్‌లో వరుసగా వంద ఫోటోల్ని తీయగలదు) 2 ఎంపీ కెమెరా, వీడియో కాలింగ్ ఇందులో ఉన్న ఫీచర్లు. దీని ధర 28, 499 రూపాయలు.

No comments:

Post a Comment