Thursday 1 November 2012


టెక్‌బజార్
lg-optimus-vu-announced_132

ఎల్‌జీ ఆప్టిమస్ Vu 
ఎల్‌జీ కంపెనీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇది. పేరు ఆప్టిమస్ వియు. స్క్రీన్ పొడవు 5 అంగుళాలు. 4:3 నిష్పత్తి(1024 x 768 pixel) లో హెచ్‌డీ-ఐపీఎస్ డిస్‌ప్లేని కలిగి ఉంటుంది. బరువు 168 గ్రాములు. కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఉండే ఈ ఫోన్ పెన్‌తో ఇన్‌పుట్‌ని తీసుకుంటుంది. 1.3 జీహెచ్‌జెడ్ క్వార్డ్ కోర్ ఎన్‌వీడియా టెగ్రా 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. 1 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎక్స్‌పెండబుల్) దీని సొంతం. ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 8ఎంపీ ప్రైమరీ కెమెరా, 1.3ఎంపీ ఫ్రంట్ కెమెరాని కలిగిఉంటుంది. 2,080 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. జీఫోర్స్ గ్రాఫిక్స్, డైరెక్ట్ వై-ఫై, డీఎల్‌ఎన్‌ఏ, ఎన్‌ఎఫ్‌సీ, స్టీరియో ఎఫ్‌ఎమ్, జీపీఎస్, ఎంహెచ్‌ఎల్ ద్వారా టీవీ-అవుట్ దీనిలో ఉన్న ప్రత్యేకమైన ఫీచర్లు. దీని ధర 34,500 రూపాయలు. 

నోకియా లుమియా 510 
Nokia_Lumia_510_4_465
నోకియా లుమియా సిరీస్‌లో భాగంగా 510 ఫోన్‌ని విడుదల చేసింది. విండోస్ 7.5 ఓఎస్‌తో పనిచేసే బడ్జెట్ ఫోన్ ఇది. 4 అంగుళాల ఎల్‌సీడీ (800 x 480 pixel) స్‌ప్లే, 800 ఎంహెచ్‌జెడ్ ప్రాసెసర్, 256 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (నాన్ ఎక్స్‌పెండబుల్) దీని ఫీచర్లు. ఈ ఫోన్ ద్వారా స్కైడ్రైవ్‌లో 7జీబీ స్టోరేజీ ఉచితంగా లభిస్తుంది. 5 ఎంపీ రేర్ కెమెరా, బిల్ట్ ఇన్ వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఇందులో ఉంటుంది. ఇతర లుమియా ఫోన్లలాగే నోకియా మ్యాప్స్, నోకియా ట్రాన్స్‌పోర్ట్, నోకియా డ్రైవ్ లాంటి ఫీచర్లు ప్రీలోడ్ చేసి ఉంటాయి. ఈ ఫోన్ ద్వారా నోకియా మ్యూజిక్‌లో మూడు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. నవంబర్ మొదటి వారం నుంచి ఈ ఫోన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ధర 10,999 రూపాయలు. 

హెచ్‌టీసీ డిజైర్ ఎక్స్ 
htc-desire-x-white
హెచ్‌టీసీ రూపొందించిన లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ డిజైర్ ఎక్స్. ఈ ఫోన్ 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్ (800 x 480 pixel), 114 గ్రాముల బరువు, 9.3 ఎంఎం మందం ఉంటుంది. ్యక్ ల్యుమినేటెడ్ ఫీచర్ ఉండే 5 ఎంపీ కెమెరా 28 ఎంఎం లెన్స్, ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్, వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఉన్నాయి. 1 జీహెచ్‌జెడ్ డ్యుయల్ కోర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ (ఎక్స్‌పెండబుల్ వయా మైక్రో ఎస్‌డీ కార్డ్), 1,650 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంటాయి. వై-ఫై, బ్లూటూత్ 4.0, 25 జీబీ డ్రాప్‌బాక్స్ ఇందులో ఉండే అదనపు ఫీచర్లు. దీని ధర 19,799 రూపాయలు. 


ఐబాల్ స్లైడ్ ఐ9702 
iball-slide-i9702-tablet
ఐబాల్ మరో బడ్జెట్ టాబ్లెట్ పీసీని విడుదల చేసింది. 9.7 అంగుళాల స్క్రీన్ ఉండే ఈ టాబ్లెట్‌ని స్లైడ్ ఐ9702 పేరుతో పిలుస్తున్నారు. క్వార్డ్ కోర్ మాలీ 400 గ్రాఫిక్స్‌తో రూపొందిన మొదటి టాబ్లెట్ ఇది. 1.5 జీహెచ్‌జెడ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (ఎక్స్‌పెండబుల్), 8,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది 7 గంటల పాటు పనిచేస్తుంది. ఇందులో 2 ఎంపీ ఫ్రంట్, రేర్ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టాబ్లెట్‌లో ఫేస్‌బుక్, జొమాటో, నీమ్‌బుజ్, క్రికెట్ నెక్ట్స్, డాక్యుమెంట్ వ్యూవర్ లాంటి యాప్స్ లోడ్ చేసి ఉన్నాయి. దీని ధర 14,999 రూపాయలు. 

ఫ్యూజీ ఫిల్మ్ ఎక్స్‌ఎఫ్1 
viewmedia
ఫ్యూజీ రూపొందించన ప్రీమియమ్ కంపాక్ట్ కెమెరా ఇది. అల్యూమినియం బాడీ, సింథటిక్ లెదర్ కవర్‌తో మూడు రంగుల్లో లభిస్తుంది. 12 ఎంపీ సీఎంఓఎస్ సెన్సార్, పాప్‌అప్ ఫ్లాష్, ఫుల్ మ్యాన్యువల్ కంట్రోల్, వైడ్ యాంగిల్ లెన్స్, 4ఎక్స్ మ్యాన్యువల్ ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 10ఎఫ్‌పీఎస్ కంటిన్యూస్ షూటింగ్ స్పీడ్, 3 అంగుళాల బ్యాక్ ఎల్‌సీడీ దీనిలో ఉన్న ఫీచర్లు. గ్రాముల బరువుండే దీని ధర 33,989 రూపాయలు.

No comments:

Post a Comment